భారత్‌లో ప‌ర్య‌టించ‌నున్న పాక్ మంత్రి బిలావల్ భుట్టో

2014 తర్వాత ఇండియాకు తొలిసారి వస్తున్న పాక్ మంత్రి

Pakistan’s foreign minister to attend regional meeting in India

ఇస్లామాబాద్ః పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ భేటీకి ఆయన హాజరుకానున్నారు. మే నెల 4, 5 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి బిలావల్ తన టీమ్ తో కలిసి రానున్నారు. పాకిస్థాన్ కు చెందిన మంత్రి ఇండియాకు వస్తుండటం 2014 తర్వాత ఇదే తొలిసారి. 2014లో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చివరిసారి ఇండియాకు వచ్చారు. షాంఘై సహకార సంస్థలో ఇండియా, చైనా, కజక్ స్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యా ఉన్నాయి. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బహరాహ్ బలోచ్ మాట్లాడుతూ.. పాక్ విదేశాంగ విధానంలో ఎస్సీఓకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు.