పాక్‌లో కరోనా టీకా రిజిస్ట్రేసన్లు ప్రారంభం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ టీకా కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 65 ఏళ్లు దాటిన వారి టీకా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. నేటి నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొద‌లైన‌ట్లు నేష‌న‌ల్ క‌మాండ్ అండ్ ఆప‌రేష‌న్ సెంట‌ర్ అధిప‌తి అస‌ద్ ఓమ‌ర్ తెలిపారు. ఆయ‌న ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మార్చిలో టీకా పంపిణీ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నున్న‌ది. టీకా తీసుకోవాల‌నుకుంటున్న వాళ్లు.. త‌మ సీఎన్‌టీసీ నెంబ‌ర్‌ను 1166 నెంబ‌ర్‌కు మెసేజ్ చేయాల‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో కోరారు. గ్లోబ‌ల్ కోవాక్స్ ఫ్లాట్‌ఫామ్‌లో భాగంగా పంపిణీ చేయ‌నున్న కోవాక్స్ టీకాల‌ను పాకిస్థాన్ త‌మ పౌరుల‌కు ఇవ్వ‌నున్న‌ది. తొలుత 65 ఏళ్లు దాటిన వారికి కోవాక్స్ టీకాను ఇవ్వ‌నున్నారు. 65 ఏళ్లు దాటిన వారికి పూర్తిగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముగియ‌గానే.. ఆ త‌ర్వాత 60 ఏళ్లు దాటిన వారికి ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి యాస్మిన్ ర‌షీద్ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/