ల‌హోర్ స్పెష‌ల్ కోర్టుకి హాజ‌ర‌యిన ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్

లాహోర్: పాకిస్థాన్ ప్ర‌ధాని షాబాజ్ ష‌రీఫ్ లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. మ‌నీ లాండ‌రింగ్ కుంబ‌కోణంలో ఆయ‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. నేడు విచారణ సందర్భంగా షాబాజ్ షరీఫ్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక పిచ్చివాడ్ని అని ష‌రీఫ్ అన్నారు. తాను గతంలో పంజాబ్ ప్రావిన్స్ కు ముఖ్యమంత్రిగా పనిచేశానని, అప్పట్లో తాను వేతనం కూడా తీసుకోలేదన్నారు. పన్నెండున్నరేళ్లుగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కానీ ఈ కేసులో తనపై మనీలాండరింగ్ ఆరోపణలు మోపారని ప్రధాని షాబాజ్ షరీఫ్ వాపోయారు.

భగవంతుడు నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. నేనొక ‘మజ్నూ’ని (పిచ్చివాడ్ని). జీతం, ఇతర ప్రయోజనాలను పొందకపోవడమే కాదు, న్యాయపరమైన హక్కులను కూడా ఉపయోగించుకోలేకపోయాన‌న్నారు. తాను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శి చక్కెర ఎగుమతులకు సంబంధించి ఓ నోట్ పంపాడని, అయితే తాను ఎగుమతి పరిమితిని నిర్ణయిస్తూ ఆ నోట్ ను తిరస్కరించానని షరీఫ్ వెల్లడించారు. జరిగింది అదేనని… కానీ తనపై మనీలాండరింగ్ అభియోగాలు మోపారని

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/