వీపు సాపు చేస్తాం అంటూ ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ లో మరోసారి బిజెపి vs టిఆర్ఎస్ వార్ మొదలైంది. మొన్నటి వరకు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వార్ జరుగగా..తాజాగా బిజెపి ఎంపీ అరవింద్ ..టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై చేసిన వ్యాఖ్యలతో ఇరు పార్టీల మధ్య వార్ కొనసాగుతుంది. బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంజారాహిల్స్ లోని ఆయన ఇంటిపై టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేసారు. ఈ క్రమంలో బిజెపి నేతలు టిఆర్ఎస్ కార్య కర్తల తీరు ఫై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అర్వింద్ కు ధైర్యం ఉంటే రాజీనామా చేసి కల్వకుంట్ల కవితపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కవితపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన టీఆరెఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజేపి ఎంపి అరవింద్ ఇంట్లో మహిళలు లేరా..? ఒక మహిళ అయిన కల్వకుంట్ల కవితపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేటుని మండిపడ్డారు.

నిన్ను కవిత చెప్పుతో కొడతా అంది కదా.. నిన్ను చెప్పుతో కొట్టాలంటే కవితక్క చెప్పు కూడా సిగ్గు పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపి గుండా గాళ్లు మా కవితక్క ఇంటికి వచ్చి దాడి చేసిన రోజు లెక్క పత్రం లేదా? అని మండిపడ్డారు. బిడ్డా దాడి కాదు ఈపు సాపు చేస్తాం గుర్తు పెట్టుకో మిస్టర్ అరవింద్.. జాగ్రత్తగా ఉండు! అని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కౌశిక్ రెడ్డి ఎంపీ అర్వింద్ ను హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి మాట్లాడితే నాలుక కోస్తామని అన్నారు. మునుగోడు ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పినా బీజేపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. మత కల్లోలాలు సృష్టించి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.