ఎంఐఎం అధ్యక్షుడిగా ఒవైసీ ఏకగ్రీవ ఎన్నిక

owaisi-was-unanimously-elected-as-mim-president

హైదరాబాద్‌ః ఆల్ ఇండియా మజిలీస్ ఏ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ జాతీయ అధ్యక్షుడిగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వరుసగా నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఓవైసీ ఒక్కరే నామినేషన్ వేయగా… ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటించింది. త్వరలో నూతన కార్యవర్గ నియామకం జరుగుతుందని తెలిపింది.

ఇది ఇలా ఉండగా, మొన్న చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని.. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేశారు అసదుద్దీన్. సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని చెప్పిన అసదుద్దీన్ చంద్రబాబును మాత్రం నమ్మలేమన్నారు. ప్రజలు కూడా చంద్రబాబు ని ఎప్పుడూ నమ్మకండని కోరారు అసదుద్దీన్. అటు అసదుద్దీన్ ఒవైసీ తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో కేరళ వయనాడ్‌లో కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని రాహుల్‌ గాంధీకి ఒవైసీ సవాల్‌ విసిరారు.