ఢిల్లీ వాసులకు సేద.. కృత్రిమ వ‌ర్షానికి ముందే మోస్తరు వాన

Overnight rain Delhi-NCR brings relief from hazardous air quality

న్యూఢిల్లీః ఢిల్లీ ప్ర‌జ‌లు గ‌త కొన్ని రోజుల నుంచి తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు ఉద‌యం ఢిల్లీలో ఆక‌స్మికంగా వ‌ర్షం కురిసింది. దీంతో అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితి మారింది. స్వ‌ల్ప పాటి వ‌ర్షంతో ఢిల్లీ ప్ర‌జ‌లు కొంత సేద తీరారు. తేలిక పాటి జ‌ల్ల‌లు కుర‌వ‌డం వ‌ల్ల‌.. ఆకాశంలో ఉన్న కాలుష్యం నుంచి విముక్తి ల‌భించింది. గాలిలో ఉన్న విష‌పూరిత వాయులు కొంత వ‌ర‌కు క్లీన్ అయ్యాయి. పాక్షికంగా వాయు నాణ్య‌త కూడా పెరిగింది.

ఒక‌వేళ వెద‌ర్ మార‌కుంటే, కృత్రిమ వ‌ర్షంతో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఢిల్లీ స‌ర్కార్ ప్లాన్ వేసిన విష‌యం తెలిసిందే. కాన్పూర్ ఐఐటీ అనుసంధానంతో దీపావ‌ళి త‌ర్వాత కృత్రిమ వ‌ర్షం కురిపించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ అక‌స్మాత్తుగా వెద‌ర్ మారిపోవ‌డంతో.. ప్ర‌స్తుతం అనుకూల టెంప‌రేచ‌ర్లు ఉన్నాయి.

మ‌రో వైపు జ‌మ్మూక‌శ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఈ సీజ‌న్‌కు చెందిన తొలి మంచు కురిసింది. శీతాకాలం లో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కుర‌వ‌నున్న విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం నుంచి అనేక ప్రాంతాల్లో అక్క‌డ స్నోఫాల్ జ‌రుగుతోంది.