‘గడప గడపకు మన ప్రభుత్వం’ : మంత్రి రోజా కు షాక్ ఇచ్చిన వృద్ధుడు

‘గడప గడపకు మ‌న ప్ర‌భుత్వం’ కార్య‌క్ర‌మం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభ‌మైంది. అయితే ఈ కార్యక్రమంలో నేతలకు ప్రజల నుండి షాక్ లు ఎదురవుతున్నాయి. తాజాగా నిన్న సోమవారం మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో పర్యటించి..ప్రభుత్వం సంక్షేమ పధకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా..ఓ వృద్ధుడి దగ్గరికి వెళ్లి నెలవారీ పింఛను అందుతుందా? అని ప్రశ్నించారు.

అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడనని, తనకెక్కడైనా పిల్లను చూడాలని, పెళ్లి కావాలంటూ విన్నవించాడు. ఈ జవాబుతో అవాక్కైన మంత్రి రోజా ఒక్కసారిగా నవ్వేశారు. ఆమెతోపాటు చుట్టుపక్కల ఉన్నవారు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్లు మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడడం తన పని కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.