NTR30 ఫస్ట్ లుక్ కేక పుట్టిస్తుంది

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంతవరకు పూర్తి కావాల్సి ఉండగా..స్క్రిప్ట్ లో మార్పులు జరగడం తో సినిమా సెట్స్ పైకి వెళ్లడం కాస్త ఆలస్యమైంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. రీసెంట్‌గా ఆమె బర్త్‌ డే సందర్భంగా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు మేకర్స్. తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పిక్ అంటూ ఓ పిక్ వైరల్ అవుతోంది. నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ పేరిట ఫేక్ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఈ లుక్‌ ను వదిలారు.

ఈ లుక్ లో ఎన్టీఆర్ లుంగీ కట్టు, మెలి తిప్పిన మీసం, చేతిలో బారు కత్తితో పాటు మరో చేతిలో లంగర్ చైన్‌తో రౌద్ర రూపంలో కనిపిస్తున్నాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో కెరటాలు ఉప్పొంగుతున్నట్లుగా డిజైన్ చేసిన పోస్టర్ కేక పుట్టిస్తుంది. నిజంగా ఫస్ట్ లుక్ కూడా ఈ రేంజ్ లో ఉంటుందో ఉండదో అని మాట్లాడుకునేలా డిజైన్ చేసారు. అంతేకాదు లుక్‌కు తగ్గట్లుగా ‘ఆ ఒక్కడుంటే భయానికి కూడా భయమే. అతను ప్రపంచాన్ని పాలిస్తున్నాడని పంచ భూతాలే నిర్ణయిస్తాయి’ అనే కొటేషన్ కూడా జత చేశారు.

ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ పిక్ ఫ్యాన్ మేడ్ పోస్టర్. అయినప్పటికీ ఇందులో ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్.. కథ తెలియకముందే ఇది ఖచ్చితంగా హిట్ ప్రాజెక్ట్ అని డిసైడ్ అవుతున్నారు.