కరోనా బారినపడిన నందమూరి బాలకృష్ణ

సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారినపడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణైనట్లుగా ఆయన స్వయంగా వెల్లడించారు. గత రెండ్రోజులుగా తనను కలిసిన వాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటించారు. ఈ విషయం తెలిసి అభిమానులు , తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు , సినీ ప్రముఖులు , శ్రేయోభిలాషులు బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంచుకుంటున్నారు. కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో కలిసి బాలకృష్ణ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరబాద్‌లోనే హోమ్‌ ఐసోలేషన్‌లో బాలకృష్ణ ఉన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు.

అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. రీసెంట్‌గా యోగా డే సందర్భంగా ఆయన హైదరాబాద్‌ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన యోగా వేడుకలకు బాలయ్య హాజరయ్యారు. ఇదిలా ఉంటె బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌ సీజన్‌ సెకండ్‌ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ టైమ్‌లో బాలకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో షో కొనసాగుతుందా లేక ఏమైనా గ్యాప్ వస్తుందా అనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.