శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 1.40 కిలోల బంగారం పట్టివేత

Gold price
Gold

హైదరాబాద్‌ః శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారాన్నిసీజ్ చేశారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుంచి రూ. 66.47 ల‌క్ష‌ల విలువ చేసే 1.40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు తెలిపారు. తున చేప ఆయిల్ డ‌బ్బాల్లో బంగారు తీసుకొచ్చిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. మ‌రో ప్ర‌యాణికుడు పేస్ట్ రూపంలో బంగారం తీసుకొచ్చాడు. బంగారం త‌ర‌లించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను క‌స్ట‌మ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.