కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్న

కేంద్ర ప్రభుత్వం ఫై గత కొద్దీ నెలలుగా తెరాస విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర సర్కార్ తప్పులను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ..కేంద్రానికి సూటి ప్రశ్నలు చిందిస్తున్నారు. తాజాగా మరోసారి కేంద్ర సర్కార్ కు సూటి ప్రశ్న వేశారు. ఆరు నెలలు క్రితం రూ.లక్షతో ప్రారంభించిన కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్‌ హాన్స్‌ కంపెనీని విక్రయించడం అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తోందని కేటీఆర్‌ మంగళవారం ట్విట్టర్‌ ద్వారా అనుమానాలను వ్యక్తం చేశారు. 2017లో పవన్‌ హన్స్‌ కంపెనీ విలువ రూ.3700కోట్లు అయితే అందులో 49 శాతం వాటాను కేవలం రూ.211కోట్లకు ఎలా విక్రయిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. మరి దీనికి సర్కార్ ఏ సమాధానం చెపుతుందో చూడాలి.