దసరా కు రామ్ – బోయపాటి మూవీ రిలీజ్

ఇస్మార్ట్ శంకర్ తో అసలైన మాస్ హిట్ అందుకున్న రామ్..ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు రామ్. ప్రస్తుతం ఆశలన్నీ బోయపాటి మూవీ పైనే పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో రామ్ సరసన నాయికగా శ్రీలీల అలరించనుంది. ప్రస్తుతం షూటింగు దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైన దగ్గర నుంచి కూడా మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడం తో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రమంలో సినిమా ఈరోజు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో దున్నపోతును కంట్రోల్ చేసే మాస్ హీరోగా ఈ పోస్టర్లో రామ్ కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా పాన్ ఇండియా గా రిలీజ్ కాబోతుంది.