కేరళ సాయం కోరిన మహారాష్ట్ర

 వైద్యులు, నర్సులను పంపించాలని వినతి

nurses
nurses

Mumbai: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిపుణులైన వైద్యులు, నర్సులను పంపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేరళ సర్కార్‌ను కోరింది.

రాష్ట్రంలో కరోనాపై పోరుకు 50 మంది డాక్టర్లు, 100 మంది నర్సులను పంపించాలని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేరళ ప్రభుత్వానికి  లేఖ రాసింది.

అయితే కరోనా వైరస్‌ నిర్మూలనకు మహారాష్ట్రకు సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వైద్యులను పంపిస్తామని కేరళ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించి తమకు ఒక లేఖ రాయాలని కోరింది.

దీంతో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ మేరకు లేఖ రాసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 50,231కి చేరింది.

రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 3041 కేసులు నవెూదవగా, 58 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం మరణాల సంఖ్య 1635కి పెరిగింది.

భారత్‌లో సరైన సమయంలో లాక డౌన్‌ అమలు చేయడంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేయగలిగామని సెంట్రల్‌ కరోనా టాస్క్‌ ఫోర్స్‌ ఎంపవర్డ్‌ గ్రూప్‌ -1 చైర్మన్‌వీకే పాల్‌ అన్నారు.

లాకడౌేన్‌ కారణంగా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాలను చాలా వరకు నియంత్రించగలిగామన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/