కివీస్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చిన భారత్‌

Virat Kohli
Virat Kohli

హామిల్టన్‌: ఇండియా-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ 65 పరుగులు చేయగా, కేఎల్‌ రాహుల్‌ 27 పరుగులు చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అర్థశతకం చేస్తాడనే అంతా అనుకున్నారు కానీ హమిశ్‌ బెన్నెట్‌ బౌలింగ్‌ అనూహ్యంగా ఔటయ్యి అందరినీ నిరాశ పరిచాడు. ఇక శివమ్‌ దూబే 3 పరుగులు చేయగా, శ్రేయస్‌ అయ్యర్‌ 17 పరుగులు, మనీశ్‌ పాండే 14 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. దీంతో టీమిండియా న్యూజిలాండ్‌కు 179 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఇక విరామం అనంతరం న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ దిగింది. ప్రస్తుతం కివీస్‌ బ్యాట్స్‌మన్‌లు గుప్తిల్‌, కాలిన్‌ మున్రో క్రీజులో ఉన్నారు. 2 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ 12 పరుగులు చేసింది. టీమిండియా నుంచి ప్రస్తుతానికి శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ బౌలింగ్‌ వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/