ఆయిల్​ ట్యాంకర్​లో పేలుడు.. 4 మంది మంది మృతి

ఒడిశా : ఒడిశాలోని నయాగఢ్​ జిల్లాలో బడాపాండుసర్​ వంతెనపై ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై ప్రయాణిస్తున్న ఓ ఆయిల్​ ట్యాంకర్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో వెంటనే ట్యాంకర్​.. వంతెనపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైనట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/