లోకేష్ ఒక అర బుడ్డాగాడు..పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతాం అంటూ జోగి రమేష్ ఆగ్రహం

ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ (NTR) హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రగడ నడుస్తుంది. వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళలన చేస్తుంది. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్..నారా లోకేష్ ఫై పలు వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ ను పిచ్చి కుక్కను కొట్టినట్లు కొడతామని..లోకేష్ ఒక అర బుడ్డాగాడని.. దొడ్డిదారిన నిన్ను మీ అయ్య మంత్రిని చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ మోహన్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే లోకేష్ దవడ పేలిపోవడం ఖాయమని.. మెడికల్ కాలేజీల పై ఎక్కడైనా మేమ చర్చకు సిద్ధమన్నారు.

లోకేష్ మీ అయ్య ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టాడోనని.. మేం ఎన్ని మెడికల్ కాలేజీలు పెడుతున్నామో చర్చిద్దామని పేర్కొన్నారు. చర్చకు మీరొచ్చినా సరే…మమ్మల్ని ఎన్టీఆర్ భవన్ కు రమ్మన్నా సరేనని సవాల్‌ విసిరారు. హెల్త్ యూనివర్శిటీ పేరు పెట్టడంలో తప్పు లేదని.. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిలో నిలిపేందుకు చంద్రబాబు ఏనాడైనా ఆలోచన చేశావా అని నిలదీశారు. అధికారమున్నప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబుకి గుర్తురాలేదా.. అధికారం పోగానే ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చేసిందని నిలదీశారు.

టీడీపీ నేతలకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై నిజంగా అంత ప్రేమ ఉంటే చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమే ఎన్టీఆర్‌పై నిజమైన ప్రేమ ఉందన్నారు. అందుకే జిల్లాకు ఎన్టీఆర్‌ పెడతానన్న హామీని నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ (NTR) కు భారతరత్న కోసం చంద్రబాబు ఏం చేశారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్డీఏతో అధికారం పంచుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తాము, మాత్రం ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లాకు పేరు పెట్టామన్నారు. ఎన్టీఆర్‌ను గౌరవించిన పార్టీ వైస్సార్సీపీ మాత్రమేనని అన్నారు.