ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనే బాధాకరం..గంటా

తిరుపతి: విశాఖ గుండె చప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేస్తుండటం అనే ఆలోచనే బాధాకరమని…శరీరం నుంచి ఓ భాగం వేరు అయినట్లు ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ..ఉక్కు ఉద్యమానికి శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చామని తెలిపారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ విశాఖ ఉక్కు కోసం నిలబడ్డాయని చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు అని, అమ్మేస్తాం లేదా మూసేస్తాం అన్నట్లు కేంద్ర వైఖరి ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాము అని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. విశాఖ ఉక్కు బాధ్యతను సీఎం జగన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చొరవ తీసుకుంటే కలిసి నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాజీనామా చేస్తే ఎలా పోరాడతాం అని వైసీపీ మంత్రులు అంటున్నారని…అయితే చివరి అస్త్రం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/