60 ఏళ్లకు చేరుతున్న తారక్.. ఆందోళనలో ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని క్రియేట్ చేసేందుకు చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డలు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో తారక్ లుక్ సరికొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బుచ్చిబాబు సానా తారక్‌కు ఓ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథను వినిపించాడట. ఈ సినిమాలో తారక్ 60 ఏళ్ల వయస్కుడిగా ప్రేక్షకులకు కనిపించేందుకు రెడీ అవుతున్నాడట.

ఇలా 60 ఏళ్ల వృద్ధుడిగా తారక్ కనిపించనుండటంతో ఈ సినిమాలో తారక్ ఎలా ఉండబోతున్నాడా అనే ఆసక్తి అప్పుడే సినీ వర్గాల్లో నెలకొంది. కాగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ చేయబోయే సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటల్‌ను చిత్ర యూనిట్ కన్ఫం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.