తారక్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో నుండి ఇప్పటి వరకు చరణ్ రామరాజు, తారక్ భీం పాత్రలకు సంబంధించిన టీజర్లు రిలీజ్ చేశారు. కానీ ఇద్దరు హీరోలు కలిసి ఉన్న టీజర్‌ను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. దీంతో తారక్ పుట్టినరోజు కానుకగా డబుల్ ట్రీట్ ఇవ్వాలని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా నుండి తారక్ పాత్ర భీంకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌తో పాటు ఈ చిత్ర టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ నుండి తారక్ పుట్టినరోజు కానుకగా డబుల్ ట్రీట్ వస్తుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి నిజంగానే తారక్ పుట్టినరోజుకు డబుల్ ట్రీట్ ఉందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను నిర్మాత డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.