ఎన్టీఆర్ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు:

Venkaiah Naidu
Venkaiah Naidu

హైదరాబాద్ః స్వర్గీయ ఎన్టీ రామారావు గొప్ప సంస్కరణవాది అని, రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారని మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. పురాణ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించిన మహానటుడని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే తెలుగు వారి గుండె చప్పుడు అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి నవశకానికి బాటలు వేశారని చెప్పారు. దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారని, నిరంకుశ రాజకీయాలకు ఎదురొడ్డి నిలిచారని ఎన్టీఆర్ ను కొనియాడారు.