ఏపీలో పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్ ..?

ఏపీలోని నెల్లూరు లో పదో తరగతి ప్రీ పబ్లిక్ పేపర్ లీక్ కావడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన హిందీ పేపర్ లోని ప్రశ్నలు ఎగ్జామ్‌లో రావడంతో.. ఇంగ్లిషు, లెక్కల క్వశ్చన్ పేపర్లు కూడా ఇవే కావడంతో మరింతగా ఆందోళన చెందుతున్నారు. ఒకరోజు ముందుగానే పేపర్లు నెట్ లో ప్రత్యక్షమవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే ఈ పేపర్ ని ఇచ్చి మనుబోలు లోని ఓ కోచింగ్ సెంటర్ లో తర్ఫీదు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు దీని గురించి పట్టించుకోకపోవడం చర్చగా మారింది. ప్రీ పబ్లిక్ లో వచ్చే మార్కులు ఉత్తీర్ణతకి ఉపయోగ పడకపోయిన వాటి ఆధారంగానే విద్యార్థి సామర్థ్యాని అంచనా వేసి పబ్లిక్ పరీక్షల కోసం మరింతగా శ్రమించేందుకు కృషి చేయవచ్చు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రశ్నాపత్రాలు నెట్లో లీక్ అవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై సర్కార్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.