ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్ ఫ్యామిలీ

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె  కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం తన నివాసంలో ఉరి వేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈమె మరణం నందమూరి కుటుంబంలో విషాదం నింపింది. ఈమె మరణ వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసారు. బుధువారం ఈమె అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి.

ఇదిలా ఉంటె గురువారం ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులను జూ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ పరామర్శించారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఎన్టీఆర్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన వెంటనే వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరామర్శ అనంతరం ఎన్టీఆర్ తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఎవరితోనూ, ఏమీ మాట్లాడకుండానే అందరూ వెళ్లిపోయారు.