పవన్ పేరు చెప్పగానే ఎన్టీఆర్ ఆపకుండా క్లాప్ కొట్టారు

ఒకప్పుడు నందమూరి అభిమానులు , మెగా అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది..అలాంటిది గత కొంతకాలంగా అభిమానుల తీరు మారింది. అంత ఒకటే అని ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇరు అభిమానులను మరింత దగ్గర చేసారు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేసాడు రాజమౌళి. ఈ మూవీ లో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రలు పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ పలు భాషల్లో ప్రమోషన్ కార్య క్రమాలు చేస్తూ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అలియాభట్ లు కపిల్ శర్మ షో లో హాజరై సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భాంగా కపిల్ శర్మ.. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ పేర్లు చెబుతూ వాళ్ళు పెద్ద స్టార్స్ అంటున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా క్లాప్ కొట్టడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా త్రివిక్రమ్ అరవింద సమేత లాంచ్ లో కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తో తమ స్నేహం ఇంకా బలంగా మారింది అని నా అభిమానులు రామ్ చరణ్ నటన ఇష్టపడతారని తెలియజేసిన జూనియర్ ఎన్టీఆర్ మెగా అభిమానులు కూడా తనను ఎంతగానో ఇష్టపడతారని పాజిటివ్ గా తెలియజేశాడు. తప్పకుండా ఈ సినిమాతో అభిమానులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారని ఎన్టీఆర్ తెలిపాడు.