తెలంగాణ లో సోమవారం ఒక్కరోజే 12 ఓమిక్రాన్ కేసులు

Omicron likely to be dominant strain globally in 2022: Singapore experts

తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. విదేశాల నుండి వచ్చిన వారి కారణంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ లో సోమవారం ఒక్క రోజే 12 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు 56 కు చేరాయి. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో 10 మందిలో ఈ కొత్త వేరియంట్‌ వెలుగు చూడగా.. మరో ఇద్దరు కాంటాక్టు వ్యక్తుల్లో ఈ వైరస్‌‌ను గుర్తించారు. ఒమిక్రాన్‌ బాధితుల్లో ఇప్పటివరకు 10 మంది కోలుకున్నారు.

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. భారత్‌లో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించింది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఇప్పటివరకు 151 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఢిల్లీ అత్యధికంగా 142 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి. .