ఈ నెల 23 న ఎన్టీఆర్ 30 వ చిత్రం ప్రారంభం..

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అందరిలో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అదికాక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టడం తో ఈ సినిమా ఫై మరింత ఆసక్తి పెరిగింది. కాగా గత కొద్దీ రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మేకర్స్ నుండి ఓ గుడ్ న్యూస్ రాబోతున్నట్లు సమాచారం. ఈ నెల 23 న ఈ మూవీ తాలూకా ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలుస్తుంది. రెగ్యులర్ షూటింగును ఈ నెల 30 నుంచి మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్స్ ను వేశారు. మొదటి షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్లు చిత్రకరించున్నారట. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ చిత్రీకరణతో ఫస్టు షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో తలపడే విలన్ పాత్రలో ‘సైఫ్ అలీ ఖాన్’ కనిపించనున్నాడని వినికిడి.