బస్సులోనే హోలీ సంబరాలు జరుపుకున్న టీమిండియా క్రికెటర్స్

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ , రాజకీయ , బిజినెస్ ఇలా అన్ని రంగాల వారు కుటుంబ సమేతంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఇక టీమిండియా క్రికెటర్స్ మాత్రం బస్సులోనే హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తూ విషెస్ చెప్పుకున్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి బస్సులో వెళ్తు్ండగా క్రికెటర్లు హోలీ ఆడుతూ సందండి చేశారు. దీన్నంతా శుభ్‌మాన్ గిల్ తన ఫోన్ లో రికార్డు చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.