నవలా రచయిత అబ్దుల్‌రాజాక్ గుర్నాకు సాహిత్య పురస్కారం

స్టాక్‌హోమ్‌ : ఈ ఏడాది నోబెల్‌ సాహిత్య పురస్కారం టాంజానియా నవలా రచయిత అబ్దుల్‌రాజాక్ గుర్నాకు లభించింది. బ్రిటిష్‌ వలసవాద ప్రభావం, గల్ఫ్‌లో శరణార్థుల వ్యథలపై ఏ మాత్రం రాజీపడకుండా చేసిన రచనలకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. రజాక్‌ 1948లో హిందూ మహాసముద్రంలోని జాంజిబర్‌ ద్వీపంలో జన్మించారు. అప్పుడు అది బ్రిటిష్‌ పాలనలో ఉండేది.

1963లో జాంజిబర్‌కు స్వాతంత్య్రం లభించింది. తర్వాత టాంజానియాలో భాగం అయింది. అయితే టాంజానియా అధ్యక్షుడు అబిద్‌ కరుమే పాలనలో అరబ్‌ జాతీయులపై ఊచకోతలు జరిగాయి. దీంతో 1960ల చివర్లో రజాక్‌ ఇంగ్లండ్‌కు శరణార్థిగా వెళ్లారు. ఈ క్రమంలో ఖండాల మధ్య, సంస్కృతుల మధ్య నలిగిపోతూ శరణార్థులు పడుతున్న వ్యథలకు అక్షర రూపం ఇచ్చారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/