ఫిలీప్పీన్స్‌లో తొలి కరోనా మృతి కేసు

First coronavirus death case in Philippines
First coronavirus death case in Philippines

మనిల్లా: చైనాలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 300 మంది మృతి చెందారు. మరో 14వేల మందికి కరోనా సోకింది. అయితే చైనా వెలుపల మొట్టమొదటి కరోనా మృతి కేసు ఫిలీప్పీన్స్‌లో నమోదైంది. వుహాన్ పట్టణం నుంచి జనవరి 21వ తేదీన ఫిలీప్పీన్స్ వచ్చిన ఆ 44 వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. నిజానికి కొద్దిరోజులుగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని భావించామని,కానీ 24గంటల్లోనే అనూహ్యంగా అతని ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయిందని ఫిలీప్పీన్స్ హెల్త్ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం ఫిలీప్పీన్స్ కూడా చైనా,హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇక ఇప్పటివరకు ఆయా దేశాల్లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. థాయిలాండ్‌లో 19, జపాన్20, సింగపూర్ 18, దక్షణి కొరియా 15, మలేషియా 8, తైవాన్ 10, ఆస్ట్రేలియా 7, జర్మనీ 8, అమెరికా 8, ఫ్రాన్స్ 6, వియత్నాం 6, కెనడా 4, దుబాయ్ 5, రష్యా 2, ఇండియా 2, ఇటలీ 2, ఫిన్‌లాండ్‌ 1, బ్రిటన్ 2, ఫిలీప్పీన్స్ 1, శ్రీలంక 1, నేపాల్ 1, స్పెయిన్ 1, స్వీడన్‌లో 1 కేసులు నమోదయ్యాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/