బంజారా హిల్స్‌లో చిరుత సంచారం

లాక్‌డౌన్‌ కారణంగా నిర్మానుష్యంగా మారిన రోడ్లు, స్వేచ్చగా తిరుగుతున్న జంతువులు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా జన సంచారం లేక పోవడంతో వన్య మృగాల సంచారం పెరిగింది. హైదరాబాద్‌లో పగలు కొంత జన సంచారం ఉన్నప్పటికి రాత్రి పూటి పూర్తిగా నిర్మానుష్యంగా తయారవుతుంది. దీంతో జంతువులు, పక్షులు రోడ్లపై స్వేచ్చగా తిరుగుతున్నాయి. తాజాగా బంజారా హిల్స్‌ రోడ్‌ నెం 12లో కేబిఆర్‌ పార్కు వద్ద ఓ చిరుత సంచరించింది. ఇందుకు సంబందించిన వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియో మీ కోసం

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/