మరో విధ్వంసక క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా

అంతర్జాతీయ ఆంక్షల నుంచి బయటపడేందుకేనంటున్న నిపుణులు

ప్యాంగ్యాంగ్: రక్షణ సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే చర్యలను ఉత్తర కొరియా కొనసాగిస్తూనే ఉంది. దేశంపై కొనసాగుతున్న ఆంక్షలు, ప్రపంచ దేశాల ఆందోళనను పక్కనపెట్టి ఎడాపెడా అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు చేయడాన్ని పరిపాటిగా చేసుకున్న అధినేత కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా తాజాగా సరికొత్త విమాన విధ్వంసక క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గత కొన్ని వారాల్లోనే ఇది నాలుగో పరీక్ష కావడం గమనార్హం.

నిజానికి ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టకూడదు. కానీ వీటిని తోసి రాజని ఉత్తర కొరియా మిసైల్‌ను పరీక్షించింది. ఈ పరీక్ష వెనక అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందే వ్యూహం దాగి ఉందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా ఏదో విభిన్నమైన అస్త్రాన్ని పరీక్షించి ఉంటుందని దక్షిణ కొరియా, జపాన్, అమెరికా భావిస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/