పుష్ప ను ఫ్యామిలీ తో కలిసి చూసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి పుష్ప చిత్రాన్ని వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్ ని వేయించగా..బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, మోక్షజ్ఞ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త కూడా పుష్ప సినిమాను వీక్షించారు. థియేటర్ నుండి బాలకృష్ణ బయటకు వస్తున్న వీడియో వైరల్ గా మారింది.

ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‏లో పుష్ప రాజ్ పాత్రలో అదరగొట్టాడంటూ ప్రేక్షకులే కాదు.. సినీ విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విధానానికి ప్రజలు ఫిదా అయ్యారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా 200 వందల క్లబ్‏ను క్రాస్ చేసింది. ఈ సినిమాలో పుష్పరాజ్ చెప్పిన తగ్గేదే లే డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియాలో తగ్గేదే లే డైలాగ్ ట్రెండ్ అవుతుంది.

ఇదిలా ఉంటె రీసెంట్ గా పుష్ప టీం.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పాల్గొని బాలయ్య చేత తగ్గేదెలా అనిపించారు. బన్నీ, బాలయ్య ఇద్దరూ పుష్పరాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదే లే.. అంటూ తమదైన డైలాగ్ ఇరగదీశారు.

It’s all happening!

NTR and Ram Charan in #RRRMovie

Balakrishna in Yellow Dress watched #Pushpa along with Family#UnstoppableWithNBK pic.twitter.com/xl08Ado1h4— MIRCHI9 (@Mirchi9) December 30, 2021