అసలైన వెన్నుపోటు ఇదే అంటూ..నారా లోకేష్ పోస్ట్

lokesh

ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై రాజకీయంగా దుమారం రేపుతోంది.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడం ఫై టీడీపీ నేతలు , కార్యకర్తలతో పాటు నందమూరి ఫ్యామిలీ సభ్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారడంతో..బాలయ్య వ్యాఖ్యలకు వైస్సార్సీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ..ఎన్టీఆర్‌ వెన్నుపోటు అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో టీడీపీ సైతం వైస్సార్సీపీ కి దీటుగా కౌంటర్లు ఇస్తుంది.

తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ వెన్నుపోటు విమర్శలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన పాత వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఇది నిజమైన వెన్నుపోటు అంటూ మండిపడ్డారు. ‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్ ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే’అంటూ లోకేష్ ఘాటుగా స్పందించారు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. వైఎస్సార్‌ను జగన్ ముద్దాయిని చేశారంటూ ఘాటుగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.