జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదు..పోలీసులు ఫుల్ క్లారిటీ

జింఖానా గ్రౌండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న భారత్-ఆసీస్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడం తో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయిందనే వార్తలు బయటకు రావడంతో పోలీసులు స్పందించారు. తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదని క్లారిటీ ఇచ్చారు.

ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు పోటెత్తారు. వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్‌ అభిమానులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు క్రికెట్ అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడడంతో ..యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులకు, పోలీసులకు జరిగిన ఘర్షణలో పలువులు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.