సిసోడియా బెయిల్‌ పిటిషన్‌.. 15న విచారణ: ఢిల్లీ కోర్టు

Manish Sisodia’s bail petition.. Hearing on 15: Delhi court

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు )లో అరెస్టయ్యి గత ఏడాది కాలంగా తీహార్ జై ల్లో ఉంటున్న ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 15న తదుపరి విచారణ జరుగనుంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు బుధవారం ప్రకటించింది.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ఏడాది కాలంలో తీహార్ జైల్లో ఉంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED), సీబీఐ (CBI) విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఇదే కేసులో అరెస్టయ్యి తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో మనీశ్‌ సిసోడియా ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌పై ఇప్పటికే సిసోడియా తరఫు న్యాయవాది, ఈడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం అప్పట్లో తదుపరి విచారణను నిరవధిక వాయిదా వేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15న చేపట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది.