2006 నాటి చిన్నారుల సీరియల్ హత్యల కేసు..దోషులకి మరణశిక్ష రద్దు

ఉరిశిక్షను రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు

Nithari killings accused Surinder Koli, Pandher acquitted, death penalty cancelled

ప్రయాగ్ రాజ్ః సంచలనం సృష్టించిన 2006 నాటి చిన్నారుల సీరియల్ హత్యల కేసులో నిందితులుగా ఉన్న సురీందర్ కోలి, మోనిందర్ సింగ్ పాండర్ ను నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. ఈ అభియోగాల నుంచి వారికి విముక్తి కల్పించింది. రెండు కేసుల్లో మోనిందర్ సింగ్ కు ఉరిశిక్ష పడగా, అతడు హైకోర్టులో సవాలు చేశాడు. అతడిపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా, ఇంతకుముందే నాలుగు కేసుల్లో విముక్తి లభించింది. ఇప్పుడు అతడిపై ఉరిశిక్షకు సంబంధించిన రెండు కేసుల్లోనూ హైకోర్టు నుంచి ఉపశమనం దక్కింది.

సురీందర్ కోలి పై అన్ని కేసుల్లోనూ అభియోగాలను కోర్టు కొట్టివేసింది. దీంతో జైలు నుంచి విడుదలకు మార్గం సుగమం అయింది. యూపీలోని నోయిడాలో చిన్నారుల హత్యలకు సంబంధించి కేసులో మోనిందర్ సింగ్ పాండర్, అతడి సహాయకుడు సురీందర్ కోలి 2006 డిసెంబర్ 29న అరెస్ట్ కావడం గమనార్హం. తప్పిపోయిన చిన్నారుల అస్తిపంజరాలు మోనింగర్ సింగ్ ఇంటి సమీప కాలువలో కనిపించాయి. మోనిందర్ చిన్నారులపై అత్యాచారం చేసి, హత్య చేసి పడేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడికి దిగువ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టు నిలిపివేయగా, సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.