మరోసారి సుప్రీంకోర్టుకు నిర్భయ దోషి

supreme court
supreme court

న్యూఢిలీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసందే. అయితే ఇప్పటికే పలు విధాలుగా ఉరిశిక్షను ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు చేసిన దోషులు.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. జనవరి 17న ముఖేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/