ఎస్‌బీఐ, ఐఎస్‌బీ ఒప్పందం

క్షేత్రస్థాయి అనుభవం, అకాడమిక్‌ పరిశోధనను ఏకం చేయడం ఈ ఒప్పందం

sbi-indian-school-of-business-sign-memorandum-of-understanding
sbi-indian-school-of-business-sign-memorandum-of-understanding

హైదరాబాద్‌: పరిశోధన, కేస్‌ స్టడీస్‌, సామర్థ్యాల పెంపునకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చేతులు కలిపాయి. ఈ మేరకు ఎస్‌బీఐ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జే స్వామినాథన్‌, రాజేంద్ర శ్రీవాత్సవ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. క్షేత్ర స్థాయి అనుభవం, అకాడమిక్‌ పరిశోధనను ఏకం చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. ఈ ఒప్పందంలో భాగంగా భారీ స్థాయి డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్లలకు సంబంధించిన సమాచారాన్ని కంటెంట్‌గా అభివృద్ధి చేస్తారు. ఎస్‌బీఐ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రయాణం వివరాలతో బుక్‌ డాక్యుమెంట్‌ తయారు చేస్తారు. శిక్షణ, వర్కు షాపులు, సదస్సులు, సెమినార్లు ఏర్పాటు, శ్వేత పత్రాల విడుదలపై కూడా రెండు సంస్థలు సహకరించుకుంటాయని ఐఎ్‌సబీ డీన్‌ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/