‘నిమ్స్‌’ ప్రొఫెసర్‌ మీనాకుమారి లండన్‌లో కన్నుమూత

Prof.Meena kumari (File)

London: నిమ్స్‌ ప్రొఫెసర్‌ మీనాకుమారి లండన్‌లో కన్నుమూశారు. లండన్‌లో జరుగుతున్న వైద్య సదస్సులో ప్రసంగిస్తుండగా ఆమె కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మీనాకుమారి కన్నుమూశారు. నిమ్స్‌లో సీనియర్‌ ఫిజిషియన్‌గా గత 25 ఏళ్లుగా ఆమె సేవలందిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌చేసిన యూకే డిప్యూటీ హైకమిషనర్‌ డా. ఆండ్రూ ఫ్లెమింగ్‌ ఆమెకుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఈ అనూహ్యఘటనతో ఆమె కుటుంబ సభ్యులు , నిమ్స్‌ వైద్యులు , ఆసుపత్రి సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business