అమెరికాలో కాల్పులు : నలుగురు మృతి

Four people were killed in a house fire in Utah

US: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అమెరికాలోని ఉటాలో ఒక ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో అనుమానితుడ్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దాదాపు 10 వేల మంది జనాభా కలిగిన గ్రాంట్స్‌విల్లే లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే నలుగురు పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నట్లు గ్రాంట్స్‌విల్లే పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ రోండా ఫీల్డ్స్‌ తెలిపారు. వాస్తవానికి ఐదుగురిపై నిందితులు కాల్పులు జరుపగా వారిలో నలుగురు మృతి చెందారని వెల్లడించారు. ఐదో వ్యక్తికి సంబంధించి ఏ విధమైన సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/