‘అల్లుడు అదుర్స్’ లో ఐటెం సాంగ్

ఆమెను ఓకే చేయించాలని ఫిక్స్

Actress Nidhi Agarwal

నిధి అగర్వాల్. ముంబైలో సెటిల్ అయిన ఈ హైదరాబాదీ గ్లామర్ డాల్. 2017లో విడుదలైన ‘మున్నా మైకెల్’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతోనే డ్యాన్సింగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్ తో కాలు కదపడంతో అందరి దృష్టిలో పడింది.

ఫస్ట్ సినిమాతోనే డ్యాన్సింగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్ తో కాలు కదపడంతో అందరి దృష్టిలో పడింది.

తెలుగులో ఇస్మార్ట్ శంకర్ తో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నిధి. ఈ సినిమాతో గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది.

ముఖ్యంగా జిల్లెలమ్మ జిట్టా ఉండిపో లాంటి సాంగ్స్ లో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. తన కెరీర్లో ఐటమ్ సాంగ్స్ చేయనని పూనుకున్న నిధి జిల్లెలమ్మ జిట్టా సాంగ్ తో ఐటెం గర్ల్ కంటే ఎక్కువ పేరును సంపాదించుకుంది.

బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయడానికి నిధితో సంప్రదింపులు జరిపాడట.

ఐటెం సాంగ్ కి నిధి మాత్రమే కావాలని ఎంత ఖర్చైనా ఆమెను ఓకే చేయించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

నిధికి ఇంటరెస్ట్ లేకపోయినా ఆఫర్ టెంప్టింగ్ గా ఉండేసరికి ఓకే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 

తాజా క్రీడా వార్తల కోసం :https://www.vaartha.com/news/sports/