‘ది హండ్రెడ్’టోర్నీ నుంచి తప్పుకున్న వార్నర్

జింబాబ్వేతో సిరీస్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయం

david varner
david varner

సిడ్నీ; డేవిడ్ వార్నర్ ‘ ది హండ్రెడ్’ టోర్నీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఇది కరోనా ప్రభావం వల్ల కాదని, జింబాబ్వేతో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండడానికే అని తెలిపాడు. గత 12 నెలలుగా విరామం లేకుండా నేను క్రికెట్ ఆడుతున్నాని కుటుంబానికి కూడా కాస్త సమయం కేటాయించాలనుకుంటున్నాని తెలిపాడు. కాగా ది హండ్రెడ్ టోర్నీ ఇంగ్లాండ్ లో జరగనుంది. ఈ టోర్నీకి వార్నర్ 125,000 పౌండ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులై 17 నుండి ది హండ్రెడ్ టోర్నీ ప్రారంభం కానుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/telangana/