వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యులు ప్రమాణం

ప్రమాణ స్వీకారం చేయించిన‌ వెంకయ్య నాయుడు

newly-electred-mps-take-oath

న్యూఢిల్లీ: ఏపి నుండి రాజ్యసభకు కొత్త ఎన్నికైన వైఎస్‌ఆర్‌సిపి పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: