టీమిండియాకు తప్పని ఓటమి

వరుసగా మూడు వన్డేల్లో గెలిచి క్లీన్‌ స్వీప్‌ చేసిన కివీస్‌

New Zealand vs India 3rd ODI match
New Zealand vs India 3rd ODI match

మౌంట్ మౌంగనూయి: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 297 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 47.1 ఓపెనర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 300 పరుగులు చేసింది. దీంతో భారత్ పై కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసి.. టీమిండియాపై టీ20 సిరీస్ కు ప్రతీకారం తీర్చుకుంది. కివీస్ బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్(66), నికోలస్(80)లు అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో లాథమ్(32 నాటౌట్)తో జతకలిసిన గ్రాండ్ హోమ్(58 నాటౌట్) మెరుపు అర్థసెంచరీతో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/