మహిళల టీ20 సెమీస్‌లో మన ప్రత్యర్థి ఎవరో తెలుసా?

India women's national cricket team
India women’s national cricket team

న్యూఢిల్లీ: అందరి కన్నా ముందే టీ20 వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళలతో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత అమ్మాయిలు అమీతుమీ తేల్చుకోనున్నారు. గ్రూప్‌జబిలో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య జరగాల్సిన చివరి లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దాంతో, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఏడు పాయింట్లతో గ్రూప్‌జబి టాపర్‌‌గా నిలిచింది. అన్నే మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఇంగ్లండ్‌ ఆరు పాయింట్లతో రెండో ప్లేస్‌కు పడిపోయింది. దాంతో, గ్రూప్‌జఎలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌తో ఇంగ్లండ్ సెమీస్‌లో తలపడనుంది. గ్రూప్‌జఎలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియాతో గ్రూప్‌జబి టాపర్‌‌ సౌతాఫ్రికా తలడపనుంది. ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో గురువారం జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కు ఇంగ్లండ్, భారత్‌ మధ్య తొలి సెమీస్‌ ఉంటుంది. మధ్యాహ్నం 1.30కు రెండో సెమీస్‌ మొదలవుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/