కొత్త టమోటా సీడ్‌

మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన ఈస్ట్‌ వెస్ట్‌ సీడ్‌ ఇండియా

tomato seed
tomato seed


ముంబయి : కరోనా వల్ల చిన్న కమతాల టమోటా రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేర్చడం ప్రధాన సమస్యగా ఉంటోంది.

కూరగాయల విత్తనాల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఈస్ట్‌ వెస్ట్‌ సీడ్‌ ఇండియా సరికొత్తగా రెండు రకాల నూతన అధిక దిగుబడినిచ్చే టమోటా సంకర జాతి విత్తనాలను శ్రేయ, రియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

పరిమాణం, రంగులో ఒకే తరహాలో ఉండడం, ఈ పరీక్షా సమయంలో రవాణా సమస్యలను అధిగమించేలా సుదూర ప్రాంతాలకు తరలించేందుకు అనువైనవి కావడంతో ఇవి చిన్న కమతాల రైతుల ఆదరణను ఎంతగానో చూరగొన్నాయి.

కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జులై నుంచి డిసెంబరు వరకు సాగు చేసేందుకు ఈ సంకరజాతి విత్తనాలు ఎంతో అనువైనవి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/