పెరిగిన బంగారం, వెండి ధరలు..
ఈక్విటీ మార్కెట్ల పతనం, కోవిడ్-19 ప్రభావంతో బంగారం మళ్లీ రికార్డు స్థాయికి

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. ఈక్విటీ మార్కెట్ల పతనం, కోవిడ్-19 ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరువవుతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న హాట్‌మెటల్స్ సరికొత్త గరిష్టస్థాయిలను తాకేలా దూసుకుపోతున్నాయి. ఎంసీఎక్స్‌లో గురువారం ఉదయం పదిగ్రాముల పసిడి ఏకంగా రూ. 180 భారమై రూ. 41,601కు దూసుకుపోయింది. మరోవైపు వెండి ధరలు సైతం మండిపోతున్నాయి. కిలో వెండి రూ. 335 పెరిగి ఏకంగా రూ. 47,598కి చేరింది. గోల్డ్, సిల్వర్ ధరల పరుగు చూస్తుంటే ఈ ఏడాది చివరకికి రూ. 50,000 మార్క్‌ను చేరువ కావచ్చని బులియన్ ట్రేడర్లు అంచానా వేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండటంతో ఆభరణాల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. దీంతో రేట్లు కూడా పెరిగిపోయాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/