మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.87.45

ముంబై : దేశీయ ఇంధన ధరలు మిశ్రమంగా కదిలాయి. పెట్రోల్ ధర పెరిగితే, డీజిల్ ధర మాతం అక్కడే ఉంది. దీంతో హైదరాబాద్‌లో సోమవారం ఇంధన ధరలు చేరో దారిలో నడిచాయని చెప్పుకోవచ్చు.
లీటరు పెట్రోల్ ధర రూ.14పైసలు పెరిగి రూ.83.93కు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర మాత్రం రూ.80.17వద్ద నిలకడగా ఉంది.
అమరావతిలో లీటరు పెట్రోల్ ధర రూ.14పైసలు పెరిగి రూ.85.54కు చేరగా, డీజిల్ ధర మాత్రం రూ.81.32వద్ద స్థిరంగా ఉంది.
ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.14పైసలు పెరిగి రూ.85.10కు చేరగా, డీజిల్ ధర మాత్రం రూ.80.91వద్ద నిలకడగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.16పైసలు పెరిగి రూ.80.73కు చేరగా, డీజిల్ ధర మాత్రం రూ.73.56వద్ద ఉంది.
వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.14పైసలు పెరిగి రూ.87.45కు చేరగా, డీజిల్ ధర మాత్రం రూ.80.11వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.09శాతం పెరిగి 44.99డాలర్లకు చేరింది.
ఇక డబ్ల్యూటిఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.62శాతం పెరిగి 42.27డాలర్లకు పెరిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/