త్వరలో చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే

Nirmala sitaraman in parliament
Nirmala sitaraman in parliament

New Delhi: చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వేను త్వరలో ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 2023 నాటికి ఢిల్లి-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేను పూర్తి చేస్తామన్నారు. 9 వేల కిలోమీటర్ల ఎకనమిక్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నామని ఆమె చెప్పారు. 2 వేల కిలోమీటర్ల మేర స్ట్రాటజిక్‌ హైవేలు నిర్మిస్తామన్నారు.

పిపిపి పద్ధతిలో 150 రైళ్లు 

పిపిపి పద్ధతిలో 150 రైళ్లను నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. పర్యాటక ప్రదేశాలకు తేజస్‌ తరహా ప్రైవేటు రైళ్లను నడిపిస్తామని ఆమె చెప్పారు. బెంగళూరు రైల్‌ ప్రాజెక్టకు 18,400 కోట్ల రూపాయిలు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

బెంగళూరుకు 18వేల 600 కోట్లతో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థ

బెంగళూరుకు 18, 600 కోట్ల రూపాయలతో మెట్రో తరహాలో సబర్బన్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్రం 20శాతం నిధులను సమకూరిస్తుందనీ, అదనపు పిధులద్వారా 60శాతం నిధులను సమీకరిస్తామన్నారు. అలాగే అన్ని పర్యాటక కేంద్రాలతో తేజస్ రైళ్లను అనుసంధానం చేస్తామన్నారు. 11 వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ చేపడతామని నిర్మల వివరించారు.

ఫైబర్ నెట్ తో లక్ష గ్రామాల అనుసంధానం

ఫైబర్ నెట్ తో లక్ష గ్రామాలు అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అలాగే డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పౌష్టికాహారానికి రూ.35వేల కోట్లు

పౌష్టికాహారానికి రూ.35వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అలాగే ఎస్టీల అభివృద్ధికి రూ.53,700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఎస్సీలకు రూ.85వేల కోట్లు

  ఎస్సీలకు రూ.85వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. అలాగే దివ్యాంగులకు రూ.9,500కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

లక్ష గ్రామ పంచాయితీలకు ఆప్టికల్‌ ఫైబర్‌

లక్ష గ్రామ పంచాయితీలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నామని ఆర్థిక మంతరి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు.

బేటీ పడావ్‌, బేటీ బచావ్‌ దిగ్విజయం

బేటీ పడావ్‌ బేటీ బచావ్‌ కార్యక్రమం దిగ్విజయమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బాలురకంటే బాలిక ఎన్‌రోల్‌మెంటే అధికంగా ఉందని ఆమెచెప్పారు.

రవాణా రంగానికి రూ.1.70లక్షల కోట్లు

రవాణా రంగానికి రూ.1.70లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. అలాగే డేటా సెంటర్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/