సూపర్ స్టార్ మహేష్ బాబు కు బర్త్ డే విషెష్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు, అభిమానులు , రాజకీయ వేత్తలు ఇలా అంత కూడా మహేష్ బాబు కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందజేస్తూ తమ అభిమానాన్ని , ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు కు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ ను అందజేశారు.

ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు కుంటూ మహేష్‌ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి.

ఇక మహేష్ కేవలం వెండితెర ఫై మాత్రమే హీరో కాదు నిజ జీవితం లో కూడా హీరో అనిపించుకున్నాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ఈ మధ్యనే సర్కారు వారి పాట తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ ..త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.