జై బాలయ్య సాంగ్ ను రాములమ్మతో పోలుస్తున్న నెటిజన్లు

వీర నరసింహ రెడ్డి నుండి జై బాలయ్య సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ తో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే..కొంతమంది నెటిజన్లు మాత్రం జై బాలయ్య సాంగ్ ను ఒసేయ్ రాములమ్మ ట్యూన్ తో పోలుస్తున్నారు. గతంలో కూడా థమన్ సాంగ్ కు పలు ట్యూన్స్ తో పోల్చారు నెటిజన్లు. ఇప్పుడు కూడా జై బాలయ్య ను ఒసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తున్నారు. ఇంకొంతమంది మంది మాత్రం బాలయ్య సాంగ్ అంటే ఎంత కొత్తగా ఇస్తాడో అని అనుకుంటే ఈ విధంగా నిరాశ పరుస్తాడు అని అనుకోలేదు అని కామెంట్ చేస్తున్నారు.

బాలకృష్ణ – శృతిహాసన్ జంటగా క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘వీర సింహ రెడ్డి’ . మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాలోని జై బాలయ్య సాంగ్ ను శుక్రవారం మేకర్స్ విడుదల చేసారు. ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్న వారు.. లేచి నిల్చొని మొక్కుతారు.. అచ్చ తెలుగు పౌరషాల రూపం నువ్వయ్యా.. అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా..’ అంటూ సాగిన ఈ సాంగ్ కు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, సింగర్ కరీముల్లా హుషారుగా ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. జన సమూహాల మధ్య దేవాలయాల పరిశరాలలో ఈ పాటని చిత్రీకరించారు.

YouTube video